Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలియానాను బ్యాన్ చేసిన తమిళ సినీ పరిశ్రమ?

Kollywood ban on Ileana
Advertisement
  • తమిళ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకుని నటించని ఇలియానా
  • ఇలియానా వల్ల నిర్మాతకు భారీ నష్టం
  • 2021లో విడుదలైన ఇలియానా చివరి చిత్రం
Advertisement
గోవా బ్యూటీ ఇలియానాను తమిళ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఒక తమిళ సినిమా కోసం ఇలియానా సైన్ చేసింది. నిర్మాత నుంచి అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె ఆ సినిమాలో నటించలేదు. దీంతో నిర్మాతకు చాలా నష్టం కలిగింది. కాంట్రాక్ట్ ను ఇలియానా బ్రేక్ చేసిందంటూ సదరు నిర్మాత ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఆమెను కోలీవుడ్ బ్యాన్ చేసిందని చెపుతున్నారు. మరోవైపు ఇలియానా చివరి సినిమాలో నటించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. 2021లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'ది బిగ్ బుల్' ఆమె చివరి చిత్రం.
Advertisement
Advertisement
Ileana
Kollywood
Ban

More Telugu News